మాములుగా వేరే భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాని తెలుగులో డబ్బింగ్ చేయడం సాధారణం. అలా అనువదించాక కూడా మళ్ళీ దాన్నే రీమేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని దెబ్బ తిన్నాయి. ఉదాహరణకు భాగ్యరాజా తమిళ చిత్రాన్ని ‘చిన్నరాజా’గా ఇక్కడి ఆడియన్స్ కి అందించాక వెంకటేష్ తో ఈవివి ‘అబ్బాయిగారు’గా తీస్తే రెండూ హిట్ అయ్యాయి. ఇది తూర్పు సిందూరం-చిలకపచ్చ కాపురం కేసులో రివర్స్ అయ్యింది. పార్తీబన్ సీతల ‘యముడే […]