ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ ని ఓవర్ టేక్ చేసి మరీ దాన్ని మించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కెజిఎఫ్ చాప్టర్ 2కి కొనసాగింపు ఉంటుందా లేదానే అనుమానాలు అభిమానుల్లో ఇంకా ఉన్నాయి. క్లైమాక్స్ లో షిప్పు మునిగి రాఖీ భాయ్ చనిపోయాడన్నట్టుగా చూపించారు కానీ ఎండ్ టైటిల్స్ అయ్యాక మళ్ళీ విదేశీ అధికారులు రావడం, అక్కడో ట్విస్టు పెట్టడం వగైరా ఆసక్తి రేపాయి. అంటే మూడో భాగానికి అవకాశం ఇచ్చి వదిలేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. […]