కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బిజెపి సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరిస్తుంది. యుపి కేంద్రంగా ఆమె రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. వలస కార్మికులను తరలించేందుకు కాంగ్రెస్ తరపున వెయ్యి బస్సులను సమకూర్చిన ప్రియాంక గాంధీ, అనేక అంశాలపై వెనువెంటనే స్పందిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ప్రియాంక గాంధీ కార్యక్రమాలను కూడా యుపి ప్రభుత్వం అడ్డుకుంటుంది. […]