కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బియ్యం, గోధుములు, ప్పు ధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఆహార పదార్థాలు, మరికొన్ని ప్యాకేజింగ్ వస్తువులపై 5శాతం జీఎస్టీ విధించాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై కేరళ ప్రభుత్వం ముందుడుగు వేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. కేరళలోని చిన్న దుకాణాలు, కుటుంబశ్రీ పేరుతో నడుస్తున్న సహాయక బృందాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు వాళ్ళు విక్రయించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించమని ప్రకటించింది. కుటుంబశ్రీ, ఇతర సంస్థలు 1 లేదా 2 కిలోలతో విక్రయించే లూజ్ ప్యాకెట్లు, వస్తువులపై పన్ను విధించబోమని కేరళ ఆర్థిక […]
దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన సీఏఏ,ఎన్నార్సి బిల్లును మొదటినుండి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజాగా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన NPR(నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్) ను కూడా తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం NPR కోసం రూ.3,900 కోట్ల బడ్జెట్ కేటాయిచింది. ఇప్పటికే సీఏఏ,ఎన్నార్సి బిల్లులను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన పినరయి విజయన్ తాజాగా NPR ను తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని స్పష్టం […]