ఉగాదికల్లా పరిపాలనా రాజధాని ఇంకా ముఖ్య కార్యాలయాలను విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారగణం కదులుతోంది. విశాఖలోని పలు భవనాలను పరిశీలిస్తూ వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్న దాన్ని అంచనావేస్తున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విశాఖ కలెక్టర్ తో పలుమార్లు చర్చించారు. గతంలో బీచ్ రోడ్లోని మిలినియం టవర్స్ లో సచివాలయం, సీఎం ఆఫీసు ఏర్పాటు చేయాలని భావించినా కొన్ని కారణాలవల్ల అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు […]