దేశంలో కరోనా వైరస్ సునామీ సృష్టిస్తున్న వేళ మహమ్మారికి మూకుతాడు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్కు వెళుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ విధించడం ద్వారానే మహమ్మారికి మూకుతాడు వేయగలమనే నిర్థారణకు వస్తున్న రాష్ట్రాలు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ను ప్రకటిస్తున్నాయి. గత సోమవారం ఢిల్లీ రాష్ట్రం లాక్డౌన్ ప్రకటించగా.. తాజాగా కర్ణాటక అదే బాటలో నడిచింది. కర్ణాటకలో రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు యడ్యూరప్ప ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. ఉదయం 6 […]