ఒక మనిషి గొప్ప వాడైతే లాభం లేదు. దానికి అదనంగా ఆస్తులుండాలి, వారసత్వం వుండాలి. కాంతారావు గొప్పవాడే. ఆస్తులు లేవు. హీరోలుగా రంగంలో ఉన్న వారసులు లేరు. మార్చి 22 వర్ధంతి. ఎవరైనా ఆయన గురించి నాలుగు మంచి మాటలు రాస్తారేమో అని పత్రికలు వెతికాను. కనపడలేదు. అన్నీ చదవలేను, చూడలేను. కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకున్న వాళ్లెవరైనా వుంటే అది వాళ్ల సంస్కారం, గొప్పతనం. కాంతారావు 400 సినిమాల్లో నటించాడు. ఎక్కువగా జానపదాలు. కత్తియుద్ధాల వీరుడు. […]
1967లో ఎన్టీఆర్, కాంతారావు నటించిన చిక్కడుదొరకడు సినిమా వచ్చింది. ఈ సినిమా కథని చంద్రబాబు ప్రేరణగా తీసుకున్నట్టున్నాడు. కాంతారావు తనని తాను దిలీప చక్రవర్తిగా ఊహించుకుని , అమరావతి అనే ఊహాజనిత రాజధానిలో పాలిస్తూ ఉంటాడు. లేని అమరావతిని ఉందని, అందరూ నమ్ముతూ ఉంటారు. చంద్రబాబు కూడా ఇలాగే ఐదేళ్లూ అమరావతిలో ఏదో జరిగిపోతోందని నమ్మించాడు. సినిమాలో కాంతారావు నిజంగా చక్రవర్తి అనుకుని , అమరావతికి ఎంతో మంది రాజులు కానుకలు పంపుతూ ఉంటారు. చంద్రబాబు అమరావతిలో […]