సౌత్ ఇండియన్ మెగాస్టార్స్ సూపర్ స్టార్స్ గా కోట్లాది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న చిరంజీవి రజినీకాంత్ మల్టీ స్టారర్ కాంబినేషన్ ఇప్పుడంటే అంచనాల బరువు, కథల కరువులో ఊహించలేం కానీ 80 దశకంలో ఇది రెండుసార్లు సాధ్యమయ్యింది. అందులో మొదటిది కాళి. ఆ విశేషాలు చూద్దాం. 1980 సంవత్సరం. చిరు కెరీర్ అప్పటికి ఊపందుకోలేదు. మంచి వేషాలు వస్తున్నాయి కానీ సోలో హీరోగా నిలదొక్కుకునేందుకు బాగా కష్టపడుతున్న సమయం. కమల్ హాసన్ తో ‘గురు’ లాంటి […]