వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ కే.చంద్రమౌళి గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతూ నేడు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2019 ఎన్నికల సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రమౌళి ఎన్నికల అనంతరం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుటపడక పోవడంతో కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తిరుపతిలో యం.ఏ చదువుతున్న రోజుల్లో పక్క క్యాంపస్లో వై.యస్ […]