1979 ‘శంకరాభరణం’ ప్రభంజనం తర్వాత దర్శకులు కళాతపస్వి కె విశ్వనాథ్ గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక ముసలాయన్ని హీరోగా పెట్టి సంగీత భరిత సినిమా తీస్తే బాషా భేదం లేకుండా క్లాసు మాసు అందరూ దానికి నీరాజనాలు పట్టడం గురించి అంతర్జాతీయ వేదికల మీద కూడా చర్చలు జరిగాయి. కమర్షియల్ సూత్రాలకు దూరంగా చేసిన ఈ ప్రయత్నం ఇప్పటికీ చెక్కుచెదరని పేరు ప్రతిష్టలు సంపాదించింది. తర్వాత విశ్వనాథ్ 3 చిత్రాలు చేశారు. సిరిసిరిమువ్వ హిందీ రీమేక్ ‘సర్గం’ […]
హాస్యబ్రహ్మ జంధ్యాల గారికి ఆ బిరుదు ఊరికే రాలేదు. చక్కని హాస్యంతో ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈవివి సత్యనారాయణ లాంటి శిష్యులు వారి బాటలోనే నడిచి ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నారు. 1989 సమయంలో జంధ్యాల గారు మంచి ఊపుమీదున్నారు. చూపులు కలిసిన శుభవేళ, హైహై నాయక, జయమ్ము నిశ్చయమ్మురా హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న సమయంలో కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దామని […]
ఏదైనా ఒక మంచి కథ సినిమాగా తీసినప్పుడు అది విజయం సాధించలేకపోతే దాన్ని వేరొకరు మళ్ళీ తీసే ప్రయత్నం చేయడం ఎప్పుడూ కాదు కాని ఇండస్ట్రీలో పలుమార్లు జరిగింది. అదే ఇద్దరు గొప్ప దర్శకులు చేస్తే అది ఖచ్చితంగా విశేషమే. దానికిది ప్రత్యక్ష ఉదాహరణ. 1991లో హాస్యబ్రహ్మ జంధ్యాల గారు ‘లేడీస్ స్పెషల్’ అనే సినిమా తీశారు. నలుగురు మహిళలను ప్రధాన పాత్రలలో పెట్టి హాస్యం ప్లస్ మెసేజ్ కలబోతగా తనదైన శైలిలో రూపొందించారు. ఒక సూపర్ […]
హాస్య చిత్రాల్లో జంధ్యాల తర్వాత ఆ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో ఈవివి గారిది మొదటి వరస. ఆయన శిష్యుడిగా జంధ్యాల గారి బాటలోనే నడుస్తూ చిన్న హీరోలతో మొదలుకుని స్టార్ల దాకా ఎన్నో గొప్ప హిట్స్ అందించిన ఘనత ఈవివిది. సాధారణంగా కామెడీ సినిమాలలో పాటలకు అంతగా ప్రాధాన్యత ఉండదు. వీటి విషయంలో మ్యూజికల్ హిట్ అని వినడమే అరుదుగా ఉంటుంది. కాని ఈవివి ఈ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటూనే వచ్చారు. ముఖ్యంగా […]