సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో జమ్మలమడుగు నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకొని విలవిలాడింది. అయితే గత రెండు దశాబ్దాలుగా ఫ్యాక్షన్ని వదిలేసి ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. సాధారణ రోజుల్లో ఏ గొడవలు లేకున్నా ఎన్నికలు జరిగే రోజుల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు ఇప్పటికీ నెలకొంటున్నాయి. టీడీపీ ఆవిర్భావంతోనే ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయి. గుండ్లకుంట శివారెడ్డి, దేవగుడి నాయకుల మధ్య గత నాలుగు దశాబ్దాలుగా […]
కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలె సుధీర్రెడ్డి తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఈ రోజు ఉదయం ప్రమాదానికి గురైంది. ఉదయం ముద్ధనూరు సమీపంలోని చిలంకూరు వద్ద ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయిన ఎమ్మెల్యే కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్తో సహా కారులోని ఎవరికీ గాయాలు కాలేదు.
ఆయనది రాజకీయ కుటుంబమే.. కానీ ఆయన మాత్రం రాజకీయాలకు కొత్త. వైద్య వృత్తి చేసుకుంటూ ఉన్న ఆయన అనుకోకుండా నియోజకవర్గానికి ఇంచార్జి అయ్యారు. ఆ తర్వాత ఎన్నో కష్ట నష్టాల కోర్చి పార్టీ కోసం కష్టపడ్డాడు. ప్రతి గ్రామాన్ని ఒకటికి రెండు సార్లు తిరిగి కార్యకర్తలను తనవైపు తిప్పుకున్నారు. నియోజకవర్గంలో పాతుకుపోయిన ప్రత్యర్థి పార్టీకి చెందిన ఇద్దరు బడా నాయకులకు చెక్ పెడుతూ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ‘ఆయనకు రాజకీయాలు తెలియవు.. అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ […]