కరోనా రాక్షసి కారణంగా దేశంలో లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగిస్తూ మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది.ఐపీఎల్ వాయిదాపై ఈరోజు ఉదయమే టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీల యాజమాన్యాలకి సమాచారం అందజేసింది. ఐపీఎల్-2020 వాయిదాపై టోర్నీ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్కి కూడా బీసీసీఐ సమాచారం ఇచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ […]
బీసీసీఐ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిన్న మార్చి 29న ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమై క్రికెటర్లంతా మైదానంలో బిజీగా గడపాల్సిన సమయం ఇది. కానీ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించడంతో క్రికెటర్లందరూ కూడా తమ ఇళ్లలోనే స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.దీంతో అనుకోకుండా లభించిన విశ్రాంతి సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు క్రికెటర్లు ప్రయత్నిస్తున్నారు.గతవారం గబ్బర్ సింగ్ ఇంటిలో బట్టలు ఉతుకుతున్న వీడియోతో పాటు […]
భారత్-సౌత్ ఆఫ్రికాల మధ్య వన్డే సిరీస్ రద్దు కావడం, ఐపీఎల్ కూడా వాయిదా పడటం,దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలుతో భారత క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు.ఈ నేపథ్యంలో గురువారం భారత ఓపెనర్, తాత్కాలిక సారధి రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో లైవ్ చాట్ చేశారు.ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణపై ఉన్న అవకాశాల గురించి కెవిన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రోహిత్ కోవిడ్-19 కారణంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదమూడవ సీజన్ ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ పేరును “రాయల్ చాలెంజర్స్”గా మార్చి సరికొత్త లోగోను ఆవిష్కరించింది. సింహానికి తలపై కిరీటం పెట్టి ఉండే పాత లోగోను పూర్తిగా మార్చివేసింది. ఐపీఎల్ 13వ సీజన్ను పురస్కరించుకుని లోగో వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఆర్సీబీ “కొత్త దశాబ్దం, కొత్త ఆర్సీబీ,ఇది మా కొత్త లోగో’’ అని ట్వీట్ […]