పరీక్షలు రాసినప్పుడు మనం బాగా మార్కులొస్తాయినుకుంటాం. తీరా ఫలితాలు వచ్చాక అంతా తారుమారైందని బాధపడతాం. తాజాగా తెలంగాణ ఇంటర పరీక్షా ఫలితాల్లోనూ అదే జరిగింది. ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల్లో కొంతమంది నిర్లక్ష్యం విద్యార్థులకు మానసికంగా దెబ్బతీసింది. నల్గొండ జిల్లాకు చెందిన సిద్దేశ్వర్రెడ్డి అనే కుర్రాడు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆంగ్లం పరీక్ష రాశాడు.తనకు కచ్చితంగా 90 మార్కులు పైన వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. కానీ, ఫలితాల నాడు కేవలం 57 మార్కులే రావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఏదో తేడా జరిగిందని […]
శ్రీ చైతన్య నారాయణ (చైనా) జూనియర్ కాలేజీలకు తెలంగాణ సర్కారు షాకిచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కాలేజీలపై సీఎం కేసీఆర్ కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీలో పై దాడులు చేసిన ఇంటర్ బోర్డు తెలంగాణ వ్యాప్తంగా 68 కాలేజీలు మూసివేసింది. ఇందులో శ్రీ చైతన్య సంస్థకు చెందిన 26 కాలేజీలు, నారాయణ సంస్థకు చెందిన 18 కాలేజీలు ఉన్నాయి. విద్యార్థుల భవితకు మూలమైన ఇంటర్ విద్య పై శ్రీ చైతన్య, […]