Arjun Suravaram
Arjun Suravaram
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థి సంఘాలు కదం తొక్కుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు పాఠశాలు విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యాసంఘాలు ఆరోపిస్తున్నాయి. అలానే విద్యారంగలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ బంద్ లకు పిలుపునిస్తున్నాయి. ఇటీవలే జులై 5న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. అదే విధంగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల బంద్ కు కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి.
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 12న పాఠశాలలు, ఇంటర్ కాలేజీల బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ ఫీజుల దందా కొనసాగతున్నా ప్రభుత్వం.. నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని.. ఈ అక్రమ ఫీజు దోపిడీ దందాను తెరదించేందుకు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని విద్యార్థి సంఘ నాయకులు అంటున్నారు. హైదరాబాద్‌లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నాయకుల సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందంటూ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి కూడా సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ లో విద్య రంగానికి నిధులు కేటాయించకుండా.. విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటూ విమర్శించారు. విద్యారంగలోని ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జులై 12వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు బంద్ చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఏపీలో సైతం ప్రభుత్వ స్కూళ్లలలో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు పూర్తిస్థాయిలో టీచర్లు లేరని.. వెంటనే టీచర్ల నియామకం చేపట్టాలని విద్యా సంఘలు జూలై 5న స్కూల్స్ బంద్ చేశాయి. తాజాగా జూలై 12తెలంగాణ పాఠశాల బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ బంద్ ల విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.