అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మౌలిక సదుపాయాలను ప్రయివేటు సంస్థలు కూడా వినియోగించుకునేందుకు పచ్చజెండా ఊపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్‌ఎంసి)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, గిరిరాజ్ సింగ్, జితేంద్ర సింగ్ కేబినెట్ నిర్ణయాలను వివరించారు. అంతరిక్ష […]