స్కూళ్లు, కాలేజీల్లో మనోవికాస పాఠాలు బోధించే సైకాలజిస్ట్ దారితప్పి, జైలుకెళ్లాడు. విద్యార్ధినులతో అసభ్యకర ఛాటింగ్ చేస్తూ, పోలీసులకు చిక్కాడు. గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన సైకాలజిస్ట్ బి.పి. నగేష్ హైదరాబాద్ లోని చాలా కాలేజీల్లో వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగుతులను నిర్వహిస్తుంటాడు. పేరున్న సైకాలజిస్ట్ కూడా. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి, వాట్సప్ ద్వారా మోటివేట్ చేస్తుంటాడు. వాళ్లకున్న సందేహాలకే నివృత్తి చేస్తుంటాడు. కొందరితో మాత్రం, క్రమంగా లైంగికపరమైన అంశాలతో ఛాటింగ్ చేశాడు. ఇబ్బందిపడే సందేశాలను పంపేవాడు. […]