iDreamPost
android-app
ios-app

నిమ్స్ లో పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు… పూర్తి వివరాలు ఇవే!

  • Published Sep 14, 2024 | 4:28 PM Updated Updated Sep 14, 2024 | 4:33 PM

Hyderabad NIMS Hospital: ఇటీవల కాలాంలో గుండె జబ్బుల బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య క్రమేపి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ సమస్యకు సకాలంలో గుర్తించిన వారికి సర్జరీలు చేయించటం తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతోందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుండెం సబంధిత వ్యాధులతో బాధపడేవారికి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి శుభవార్త వినిపించింది.   ఇంతకీ అదేమిటంటే..

Hyderabad NIMS Hospital: ఇటీవల కాలాంలో గుండె జబ్బుల బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య క్రమేపి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ సమస్యకు సకాలంలో గుర్తించిన వారికి సర్జరీలు చేయించటం తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతోందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుండెం సబంధిత వ్యాధులతో బాధపడేవారికి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి శుభవార్త వినిపించింది.   ఇంతకీ అదేమిటంటే..

  • Published Sep 14, 2024 | 4:28 PMUpdated Sep 14, 2024 | 4:33 PM
నిమ్స్ లో  పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు… పూర్తి వివరాలు ఇవే!

ఈ మధ్య కాలంలో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపి పెరిగిపోతుంది. ముఖ్యంగా చిన్న వయసు వారే ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు పలు ఆధ్యయానాల్లో కూడా వెల్లడైంది. అయితే కొన్నిసార్లు ఈ గుండె సంబంధిత వ్యాధులు ప్రాణాలను సైతం బలి తీసుకుంటుంది. ఎందుకంటే..ప్రపంచవ్యాప్తంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో.. 8 నుంచి 10 శాతం మంది పిల్లల్లు ఏదో రకంగా గుండె సంబంధిత వ్యాధులుతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇందులో ఎక్కువ శాతం గర్భస్థ దశలో ఉన్నప్పుడే స్కానింగ్ రూపంలో బయటపడిన కేసులు అధికంగా ఉన్నాయి.

ఇకపోతే ఈ గుండె జబ్బుల నుంచి కొలుకొని చికిత్స చేయించేందుకు మెరుగైన వైద్యం, సర్జరీలు చాలా అవసరం. కానీ, ఇది అందరికీ సాధ్యమైన పని కాదు. ఎందుకంటే.. చిన్నారులకు చేసే ఈ గుండె జబ్బు సర్జరీలు అనేవి లక్షలతో కూడుకున్నవి. కనుక అందరికీ అంతా ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. సకాలంలో సర్జరీలు చేయించలేకపోవడం వంటి కారణాలతో చాలామంది చిన్నారులు మరణిస్తున్నారు. కానీ, ఇక మీదట చిన్నారులకు అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదనే నేపథ్యంలో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి శుభవార్త చెప్పింది. ఇంతకీ అదేమిటంటే..

చాలా మంది చిన్నారులు చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు.  ముఖ్యంగా గుండె సంబంధిత రుగ్మతలు సకాలంలోనే గుర్తించిన వారికి సర్జరీలు చేయించటం తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతోందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుండెం సబంధిత వ్యాధులతో బాధపడేవారికి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి శుభవార్త వినిపించింది.   గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఐదేళ్ల  వయసులోపు  చిన్నారులకు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా హార్ట్ సర్జరీలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప వెల్లడించారు. అంతేకాకుండా.. బ్రిటన్‌‌కు చెందిన డాక్టర్ల బృందం సహకారంతో ఈ సర్జరీలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రమణ దన్నపనేని సారథ్యంలో 11 మంది వైద్యుల బృందం నిమ్స్‌కు రానున్నట్లు చెప్పారు.

ఇకపోతే ఈ సర్జరీలు హాస్పిటల్ కార్డియో థొరాసిక్‌ విభాగాధిపతి అమరేశ్వరరావు, ప్రొ.గోపాల్‌ డాక్టర్ల బృందాన్ని సమన్వయం చేసుకుంటూ  చేస్తారని చెప్పారు. అయితే ఈ గుండె సంబంధిత సర్జరీలు అనేవి ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు ఉచితంగా చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు. పైగా ఈ సర్జరీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని అన్నారు. కనుక రాష్ట్రంలో గుండె సంబంధిత సమస్యలున్న చిన్నారులుంటే వెంటనే నిమ్స్ ఆసుపత్రిలో కార్డియో థొరాసిక్‌ డాక్టర్లను సంప్రదించాలని డాక్టర్ బీరప్ప సూచించారు. మరీ, నిమ్స్ ఆసుపత్రిలో ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది సర్జరీలు చేయనున్నమని ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.