ఏదైనా సినిమా చూస్తున్నంతసేపు చక్కిలిగింతలు పెడుతూ నవ్విస్తున్నట్టు అనిపించిందంటే అందులో నిఖార్సైన కామెడీ ఉన్నట్టు. స్టార్ హీరోలతో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా చిక్కులుంటాయి. అభిమానులను సంతృప్తి పరచటం అందులో ప్రధానమైనది. అలాంటిది వాళ్ళతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనుకోవడం కత్తి మీద సామే. దర్శక దిగ్గజం, రచయిత జంధ్యాల గారు మెగాస్టార్ చిరంజీవి తో ఓ కామెడీ నవల ఆధారంగా చంటబ్బాయి తీశారు. ఇప్పుడు మీరు చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తారు కాని ఆ రోజుల్లో […]
కొన్నిసార్లు రచయిత లేదా దర్శకుడు సినిమా కోసం ఎంతో కష్టపడి రాసుకున్న కామెడీ ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోకపోతే అప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. అది ఖచ్చితంగా పండుతుందనే నమ్మకం గట్టిగా ఉన్నప్పుడు దాన్నే మరోసారి ఇంకో మూవీ కోసం వాడుకోవడం కూడా జరుగుతుంది. ఒకవేళ ప్రేక్షకుడు కనక గుర్తుపడితే ఇబ్బంది కానీ లేదంటే హ్యాపీగా వాడుకోవచ్చు. అలాంటిదే ఇది కూడా. 1992లో నాగబాబు హీరోగా ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో 420 అనే సినిమా వచ్చింది. ఓ […]
ఏ హీరోకైనా ద్విపాత్రాభినయం సినిమాలు చాలా స్పెషల్ గా నిలుస్తాయి. ప్రతి స్టార్ ఒక్కసారైనా వీటిని ట్రై చేయకుండా వదలడు. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే అవుతుంది కానీ క్లుప్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ రాముడు భీముడు, ఏఎన్ఆర్ ఇద్దరు మిత్రులు, చిరంజీవి రౌడీ అల్లుడు, బాలకృష్ణ అపూర్వ సహోదరులు, నాగార్జున హలో బ్రదర్, వెంకటేష్ సూర్య వంశం, చరణ్ నాయక్, తారక్ అదుర్స్ ఇలా ప్రతిఒక్కరికి చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి. కానీ యాంగ్రీ యంగ్ మ్యాన్ […]
అప్పుడెప్పుడో ఎన్టీఆర్ దేవాంతకుడుతో మొదలుపెడితే విజయంసాధించిన తెలుగు సినిమాల చరిత్రలో యముడి పాత్రకు చాలా ప్రత్యేకత, విశిష్టత ఉంది. అది దశాబ్దాల పాటు కొనసాగింది. ఎందరో హీరోలు ముచ్చటపడి మరీ యముడి బ్యాక్ డ్రాప్ తో కథలు చేసి అద్భుతమైన సక్సెస్ లు అందుకున్నారు. యమగోల అప్పట్లోనే ఒక చరిత్ర సృష్టించింది. జనం తండోపతండాలుగా ఎగబడి మరీ యముడి వినోదాన్ని మనసారా ఆస్వాదించారు. ఆ తర్వాత కొంత కాలానికి చిరంజీవి యముడికి మొగుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు […]