నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కేంద్రానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. రైతు ఉద్యమానికి రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండడంతో పాటు, మిత్ర పక్షాల నుంచే కేంద్రానికి వ్యతిరేకత ఎదురవుతోంది. పంజాబు, హర్యాన రాష్ట్రాల నుంచి బీజేపీకి ఎదురు పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమి నుంచి తప్పుకుంది. లోక్ సభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి చెందిన కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల […]