జమ్మూ కాశ్మీర్లోని హంద్వారాలో ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్పై ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ఉత్తర కశ్మీర్లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో మేజర్, కల్నల్ సహా ఐదుగురు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘హంద్వారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం ఎప్పటికీ మరువలేం. దేశం కోసం, దేశ […]