అధికార వైఎస్సార్సీపీకి టీడీపీ అంతో ఇంతో పోటీ ఇవ్వగలుగుతున్న ప్రాంతం విశాఖ నగరమేనన్న అభిప్రాయం ఉంది. అయితే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చే విషయంలో ప్రభుత్వం చూపుతున్న దూకుడు, నగర పార్టీ వ్యవహారాలకు సంబంధించి టీడీపీ అధినేత అనుసరిస్తున్న వైఖరి, ఆ పార్టీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీరు కలిసి.. నగరంలో పార్టీ పుట్టి ముంచేస్తున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకునే పరిస్థితి కనిపిస్తోంది. నగారాభివృద్ధి దృష్ట్యా అధికార పార్టీతో కలిసి […]
పరిపాలన వ్యవహారాల్లో భాగంగా అధికారులు తీసుకుంటున్న ప్రతి చర్యను రాజకీయ భూతద్దంలో చూడటం.. ఆరోపణలు గుప్పించడం, రచ్చ చేయడం తెలుగుదేశం నేతలకు పరిపాటిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన భూములు, స్థలాలను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలతో అవినీతి అందలం ఎక్కిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు అధికారులు తీసుకుంటున్న చర్యలతో చుక్కలు కనబడుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతను కూడా రాజకీయం చేస్తున్నారు. విశాఖ నగరంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని […]
అధికారమే అడ్డాగా టీడీపీ నాయకులు చెలరేగిపోయారని దాదాపు అన్ని రాజకీయపక్షాలు గొంతుచించుకుని అరిచి గోలపెట్టేసేవి. కానీ అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టమొచ్చిన రీతిలో ఆపార్టీనాయకులు వ్యవరించారు. తమపై ఈగ కూడా వాలకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు, ఫోర్త్ ఎస్టేట్ను కూడా ఉపయోగించుకునేవారు. అయితే కాలం మారింది.. దాంతోపాటే ప్రభుత్వమూ మారింది. ఇప్పుడు ఒకొక్క బరితెగింపు బైటపడుతున్నాయి. బైటపడే ఒక్కో అక్రమం వెనుక ఒక్కోకథ ఉంటోంది. ప్రభుత్వం ఎదురుదాడి చేద్దామన్నాగానీ తాము అధికారంలో ఉండగా […]
విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి ఆక్రమణలు బయటపడ్డాయి. ఆయన ఇంటి నిర్మాణం కోసం ఏకంగా 11 అడుగుల స్థలం ఆక్రమించడంతో అదికారులు సీరియస్ అయ్యారు. పలుమార్లు వాటిని తొలగించాలని చెప్పినా విస్మరించడంతో నేరుగా ఆక్రమణల తొలగింపు చేపట్టారు. అయితే ఆక్రమణలు వాస్తవమేనని సబ్బం హరి కూడా అంగీకరిస్తున్నారు. కానీ తనకు నోటీసులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ముందుగా చెప్పి ఉంటే తానే తొలగించేవాడినని ఆయన అంగీకరించడం విశేషంగా మారింది. విశాఖలోని ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే సీతమ్మధారలో సబ్బం […]
బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విశాఖ నగరంలో పెరుగుతున్న కరోనా కేసులు కట్టడి చేసేందుకు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. నగర పరిధిలో కరోనా వ్యాప్తి చెందకుండా, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించేలా రెండు జోన్లకు ఒక మొబైల్ శాంపిల్ కలెక్షన్ టీమ్ని ఏర్పాటు చెయ్యాలని ఆదేశిస్తున్నారు. ఇంతలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది… బిడ్డ ఏడుస్తున్నాడని… ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ.. నెల వయసున్న బిడ్డ సంగతే మరిచిపోయిన కమిషనర్ […]