Dharani
విశాఖ వాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు. ఇకపై ఆ పని చేసే వారిపై కఠిన చర్యలతో పాటు.. లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆ వివరాలు..
విశాఖ వాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు. ఇకపై ఆ పని చేసే వారిపై కఠిన చర్యలతో పాటు.. లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్‌కు ఆయువుపట్టుగా మారబోతుంది సుందరనగరం విశాఖపట్నం. ఇప్పటికే జగన్ ప్రభుత్వం విశాఖను రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ ప్రకటించారు. ఇక విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ క్రమంలో అధికారులు కూడా ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా జీవీఎంసీ అధికారులు విశాఖ వాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు. ఇకపై ఎవరైనా ఆ పనులు చేస్తే.. లక్ష జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ వివరాలు..
సుందర నగరంగా తయారవుతున్న మహా విశాఖ నగర ప్రతిష్ట దెబ్బ తీసే చర్యలను కట్టడి చేయడానికి జీవీఎంసీ అధికారులు నడుం కట్టారు. దీనిలో భాగంగా విశాఖవాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు. ఇకపై ఎవరైనా నగర గోడలపై, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, రోడ్డు విభాగినిలపై, డస్ట్ బిన్నులపై, ప్రజా ఆస్తులపై పోస్టర్లు అతికించినా, పెయింటింగ్ లు, ఇతర రాతలు రాసినట్లయితే.. సంబంధిత సంస్థలు, ఆర్గనైజేషన్‌లపై ప్రజా ఆస్తులకు భంగం వాటిల్లే పనులకు పాల్పడితే.. జీవీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుందని.. చీఫ్ సిటీ ప్లానర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో విశాఖ నగరంలోని ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ సభ్యులు, మత సంబంధ సంస్థలు, విద్యా సంస్థల సభ్యులతో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ మాట్లాడుతూ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు సైతం విశాఖ నగరాన్ని సుందర నగరంగా, పరిశుభ్ర నగరంగా ప్రశంసిస్తున్నాయని.. ఇది ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. విశాఖ నగరానికి నిత్యం సందర్శకులు, పర్యాటకులు తరలి వస్తున్నారని.. టూరిస్టులను ఆకర్షించడం కోసం.. జీవీఎంసీ కోట్లాది రూపాయలు వెచ్చించి నగర సుందరీకరణ పనులను చేపట్టి నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుందని చెప్పుకొచ్చారు.
నగర సుందరీకరణకు తామ పాటు పడుతుంటే.. నగరంలోని పలువురు మాత్రం విచ్చలవిడిగా గోడలపై, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లపై, రోడ్డు డివైడర్లపై, డస్ట్ బిన్నులు, ప్రజా ఆస్తులపై వ్యాపార సంబంధిత, మత సంబంధిత, వినోద సంబంధిత సంస్థలు పోస్టర్లు అతికిస్తూ, పెయింటింగులు, పిచ్చి రాతలు రాస్తూ, అనధికారిక హోర్డింగులు, ఫ్లెక్సీలు, డిజిటల్ బ్యానర్లతో నగరాన్ని అశుభ్రపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాక నగరంలో ఉన్న విద్యుత్ స్తంభాలపై అసహ్యంగా సెప్టిక్ క్లీనర్ ఫోన్ నెంబర్లు రాసి ఉంటున్నాయని.. వాటిని నిరోధించవలసిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సురేష్ హెచ్చరించారు. అంతేకాక ఇలాంటి పనులకు పాల్పడే వారిపై.. 1997 యాక్ట్ ప్రకారం నగర సుందరీకరణకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం 1 లక్ష రూపాయలు వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సురేష్ కుమార్ తెలిపారు.
విశాఖ నగర పరిశుభ్రత, సుందరీకరణ దృష్ట్యా, తమ వంతు బాధ్యతగా ప్రింటింగ్ ప్రెస్ ఆర్గనైజేషన్స్, విద్యాసంస్థలు , మతపరమైన సంస్థలు, ఇతర వ్యాపార సంస్థల యాజమాన్యాలు ఇటువంటి పోస్టర్లు అతికించకుండా రాతలును నిరోధించాలని.. అనధికారిక హార్డింగ్లు, బేనర్లు ప్రదర్శించకుండా విశాఖ నగర అభివృద్ధికి సహకరించాలని సురేష్ కుమార్ వారికి విజ్ఞప్తి చేశారు.