భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబా జూన్ 18, 1923న జన్మించారు. జూన్ 18, 2022 నాటికి ఆమె తన జీవితంలో 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. హీరాబా తన జీవితంలో 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా గుజరాత్ గాంధీనగర్లోని రేసాన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య హీరాబా మార్గ్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా ప్రకటించారు. GMC(గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్) ప్రకటన ప్రకారం, హీరాబా పేరును శాశ్వతంగా […]
ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ ఈ ఏడాది చివరిలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. సుమారు రెండున్నర దశాబ్దాలుగా దూరమైన అధికారాన్ని చేజిక్కించుకోవాలని తపిస్తోంది. అయితే పార్టీ ముఖ్యనేతలను కాపాడుకోలేకపోవడం కాంగ్రెసుకు శాపంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే […]
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో శంకర్ సింగ్ వాఘేలాకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శంకర్ సింగ్ వాఘేలా ప్రజాశక్తి మోర్చా పేరిట కొత్త పార్టీని ఏర్పాటు […]
ఒక్కరోజులో 14,516 పాజిటివ్ కేసులు-375 మరణాలు కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 12 వేలకు పైగా కేసులు, 300 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 14,516 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. ఇప్పటివరకూ నిర్దారణ అయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం,. దీంతో దేశంలో కరోనా […]
గుజరాత్లో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు నాటకీయ పరిణామాల మధ్య వెల్లడైయ్యాయి. మధ్య మధ్యలో ఓట్ల లెక్కింపుకు అంతరాయం కలిగి నిలిచిపోయి ఫలితాలు ఎట్టకేలకు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో మూడు స్థానాలను బిజెపి, ఒక స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. గుజరాత్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నాలుగింటిలో మూడింటిని గెలుచుకోవాలని బిజెపి ఎప్పటి నుండో వ్యూహాలు రచించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కోనేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్ని చేసింది. రాజ్యసభ ఎన్నికల […]
దేశ వ్యాప్తంగా ఈ రోజు 18 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆయా స్థానాల్లో ముందుగా ఊహించిన విధంగానే అభ్యర్థులు విజయం సాధించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరంలలో 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో నాలుగు స్థానాలు వైసీపీ గెలుచుకోగా, మధ్యప్రదేశ్లో రెండు బీజేపీ, ఒక స్థానం కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ యువ నేత జ్యోతిరాధిత్య సింధియా బీజేపీ నుంచి రాజ్యసభకు […]
దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 19 రాజ్యసభ స్థానాలకు కొద్దిసేపటి క్రితం ఎన్నికలు ప్రారంభమయ్యాయి.గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బిజెపి,కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నడుస్తుండటంతో సాయంత్రం వెలువడే ఫలితాల పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. గత మార్చిలో రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు కరోనా మహమ్మారి కారణంగా ఓటింగ్ వాయిదా పడ్డాయి. తరువాత ఎన్నికల సంఘం కర్ణాటకలో నాలుగు స్థానాలకు,మిజోరం,అరుణాచల్ ప్రదేశ్లలో ఒక స్థానం చొప్పున భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.ఇక నేడు పోలింగ్ జరుగుతున్న 19 సీట్లలో […]
దేశవ్యాప్తంగా మరో రెండు రోజుల గడువులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మెజార్టీ రాజ్యసభ సీట్లు కైవసం చేసుకోవడానికి అధికార బిజెపి గుజరాత్లో ఇప్పటికే ఆపరేషన్ కమలంను విజయవంతంగా పూర్తి చేసింది.ప్రస్తుతం బిజెపి చూపు మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలపై పడింది. మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.గతంలో కమల్నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచిన ఐదుగురు బిజెపి యేతర,కాంగ్రెసేతర ఎమ్మెల్యేలు అధికార బిజెపికి మద్దతు ప్రకటించారు.భోపాల్లోని […]
రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గరపుడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. రాజస్థాన్, గుజరాత్ లోనే ఇలా ఉత్కంఠభరిత పరిస్థితి నెలకొంది. రాజ్యసభ ఖాలీలు కంటే ఎక్కువ మంది పోటీ చేయడం…ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠత నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుంది. క్యాంప్ లకు తరిలించి ఎమ్మెల్యేలను బిజెపి వైపు వెల్లకుండా నిలువరిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ […]
గుజరాత్లోని రాజ్యసభ ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసి తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తుంది. తద్వారా నాలుగులో మూడుస్థానాలను సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్ట్ కి పంపింది. దీంతో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల రాజకీయం రాజస్థాన్ కు చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజస్థాన్లోని వివిధ రిసార్ట్ ల్లో ఉంచారు. గుజరాత్లోని తమ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్లోని ఒక […]