iDreamPost
android-app
ios-app

సైకిల్ తొక్కడం రాదు.. కానీ పట్టుదలతో కారు నేర్చుకున్న భార్య.. ఎందుకంటే?

  • Published Aug 18, 2024 | 5:37 PM Updated Updated Aug 18, 2024 | 5:37 PM

Ahmedabad Female Cab Driver: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు కనీసం సైకిల్ తొక్కడం కూడా రాదు.. కానీ ఓ మహిళ ఏకంగా కారు నేర్చుకొని క్యాబ్ డ్రైవర్ గా కొనసాగుతుంది. పట్టుదలతో కారు నేర్చుకోవడానికి గల కారణం ఎంటో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు.

Ahmedabad Female Cab Driver: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు కనీసం సైకిల్ తొక్కడం కూడా రాదు.. కానీ ఓ మహిళ ఏకంగా కారు నేర్చుకొని క్యాబ్ డ్రైవర్ గా కొనసాగుతుంది. పట్టుదలతో కారు నేర్చుకోవడానికి గల కారణం ఎంటో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు.

సైకిల్ తొక్కడం రాదు.. కానీ పట్టుదలతో కారు నేర్చుకున్న భార్య.. ఎందుకంటే?

వేద మంత్రాల సాక్షిగా పెద్ద సమక్షంలో మూడు ముళ్ల బంధం ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని దివిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చాలా జంటలు ఏడాది కాకుండానే విడాకులు తీసుకుంటున్నారు. గ్రామస్థాయిలో పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారు. ఇందుకు కారణం భార్యాభర్తల మధ్య ఆదిపత్య పోరు, ఆర్థిక ఇబ్బందులు, గతంలో వారికి ఉన్న ఇల్లీగల్ వ్యవహారాలు, వరకట్న సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. కానీ కొంతమంది మహిళలు మాత్రం కట్టుకున్న భర్త దైవంగా భావిస్తున్నారు.. భర్త కోసం ఎన్ని కష్టాలైనా పడుతున్నారు. ఓ మహిళ తన భర్త కోసం చేసిన పని ఎంతో మందికి ఆదర్శంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ మద్య కాలంలో చిన్న చిన్న విషయాలకే కోపాలు, పంతాలు, కొట్లాడుకుంటూ విడిపోతున్నా భార్యా భర్తలు. అలాంటి ఈ కాలంలో తన భర్త అనారోగ్యం కారణంగా ఏ పని చేయకపోవడంతో ఓ మహిళ కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుంది. ఓ వైపు భర్తకు ధైర్యం చెబుతూ.. తాను దైర్యంగా ఉంటూ కారు నేర్చుకొని క్యాబ్ డ్రైవర్ గా కొనసాగుతూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. కనీసం సైకిల్ కూడా తొక్కరాని ఆ మహిళ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ గా తన కాళ్లపై తాను నిలబడి కుటుంబానికి అండగా నిలిచింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల అనారోగ్యంతో మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో ఇల్లు గడవడం చాలా కష్టమై అప్పులు చేయాల్సి వచ్చింది. అతని భార్య అర్చనా పాటిల్ కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుంది.తన భర్తకు సాయంగా ఉంటూ.. కుటుంబాన్ని పోషించుకోవాలని పట్టుదలతో కొద్దిరోజుల్లోనే కారు డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంది.. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పొందింది.

అలా ప్రతిరోజూ క్యాబ్ నడుపుతూ వచ్చిన సంపాదనతో భర్తకు మెడిసన్స్ కొనడం, కుటుంబ పోషతో పాటు అప్పులు కూడా తీర్చింది. ఒకరోజు ఆమె క్యాబ్ బుక్ చేసుకున్న వినియోగదారుడు ఆమె కథ సోషల్ మీడియా వేధికగా పంచుకున్నాడు. ‘ప్రస్తుతం ఎంతోమంది మహిళలు కుటుంబ పోషణ కోసం ఆటో రిక్షాలు తోలడం చూస్తున్నాం.. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకోవచ్చు.. కానీ, కష్టాలు చుట్టుముట్టినపుడు ఎంతో ధైర్యంతో ఎదుర్కొని కుటుంబ కోసం నిలబడే మహిళలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఒక మహిళ విజయగాధకి అర్చన జీవితం ఉదాహారణ .. దురదృష్టాన్ని ఓటమిగా భావించకుండా ధైర్యంగా పోరాడుతున్న ఆమెను కలవడం నిజంగా నాకు సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. అతను చేసిన పోస్ట్ కు ఆమె ఫోటోను జత చేశాడు. ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.