iDreamPost
android-app
ios-app

అరేబియా సముద్రంలో 48 ఏళ్ల తర్వాత అస్నా తుఫాన్.. టెన్షన్ లో ఐఎండీ!

  • Published Aug 30, 2024 | 2:13 PM Updated Updated Aug 30, 2024 | 2:13 PM

Cyclone Asna to form over Arabian Sea: దేశంలో రుతు పవనాలు చురుకుగా కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గుజరాత్, మహారాష్ట్ర, కేరళా, ఒరిస్సా సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

Cyclone Asna to form over Arabian Sea: దేశంలో రుతు పవనాలు చురుకుగా కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గుజరాత్, మహారాష్ట్ర, కేరళా, ఒరిస్సా సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

అరేబియా సముద్రంలో 48 ఏళ్ల తర్వాత అస్నా తుఫాన్.. టెన్షన్ లో ఐఎండీ!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లో అయితే వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, వంతెనలు ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గుజరాత్ కు అస్నా తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ తుఫాన్ ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది.భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్ రంగంలతోకి దిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్ కి ఐఎండీ కీలక సూచన చేసింది.‘గుజరాత్ లోని సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంపై తుఫాన్ ప్రభావం పడనుంది. శుక్రవారం అరేబియా సముద్రం మీదుగా ఉద్భవించిన ఒమన్ తీరం వైపు కదులుతుందని భావిస్తున్నారు. రానున్న రెండు రోజులు గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరాల వెంట సముద్ర ప్రాంతంలో గంటకు 60- 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1976 తర్వాత ఆగస్టులో అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాన్ ఇదే అని వాతవరణ శాఖ అధికారులు అంటున్నారు. తుఫాన్ తర్వాత పశ్చిమ – వాయువ్య దివశగా కదిలి.. తర్వాత వాయువ్య అరెబియా సముద్రం మీదుగా బలహీన పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఐఎండీ శాఖ అధికారులు. కొద్దిరోజుల పాటు మత్స్య కారులు సముద్రంలోకి వెటకు వెళ్లవొద్దని సూచించారు.

ఆగస్టు మాసంలో అరేబియా సముద్రం మీద తుఫాన్ రావడం చాలా అరుదైన విషయం.. 1944 లో ఇదే సమయంలో అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడి తీవ్ర రూపం దాల్చిందని ఐఎండీ తెలిపింది. తర్వాత 1964 లో దక్షిణ గుజరాత్ తీరానికి సమీపంలో ఒక చిన్న తుఫాన్ ఏర్పడిందని, కొద్ది రోజుల తర్వత తీరం చేరి బలహీన పడింది. ఈ తుఫాన్ ప్రభావం చాలా రోజుల వరకు ఉంటుందని.. దీనికి కారణంగా సౌరాష్ట్ర, కచ్ లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం.. దీని వల్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.