నేర్చుకోవాలే కానీ సినిమాలు కూడా వ్యక్తిత్వ నిపుణులు సైతం చెప్పలేనంత గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ కాలంలో వచ్చిన ఆణిముత్యాలు ఇప్పటి తరానికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుడిగంటలు ఓ మంచి ఉదాహరణ. ఆ విశేషాలు చూద్దాం. 1962లో శివాజీగణేశన్ హీరోగా కె శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘ఆలయమణి’ గొప్ప విజయం సాధించింది. వంద రోజులు ప్రదర్శింపబడి సూపర్ హిట్ అయ్యింది. దాన్నే తెలుగులో రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ […]