iDreamPost
android-app
ios-app

Gudi Gantalu : అపార్థం ఎంతటి పతనమో చూపించిన సినిమా

  • Published Jan 19, 2022 | 11:46 AM Updated Updated Dec 08, 2023 | 4:56 PM

అపార్థాలు మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఏ స్థాయికి తీసుకెళ్తాయో అనే పాయింట్ చుట్టూ గుడిగంటలు తిరుగుతుంది. మంచివాడైన శ్రీమంతుడు శ్రీనివాసరావు(ఎన్టీఆర్). ఇతని లక్షణాలు నచ్చి స్నేహితుడైన వాడు హరి(జగ్గయ్య). ఇద్దరికీ ప్రేమకథలు ఉంటాయి.

అపార్థాలు మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఏ స్థాయికి తీసుకెళ్తాయో అనే పాయింట్ చుట్టూ గుడిగంటలు తిరుగుతుంది. మంచివాడైన శ్రీమంతుడు శ్రీనివాసరావు(ఎన్టీఆర్). ఇతని లక్షణాలు నచ్చి స్నేహితుడైన వాడు హరి(జగ్గయ్య). ఇద్దరికీ ప్రేమకథలు ఉంటాయి.

Gudi Gantalu : అపార్థం ఎంతటి పతనమో చూపించిన సినిమా

నేర్చుకోవాలే కానీ సినిమాలు కూడా వ్యక్తిత్వ నిపుణులు సైతం చెప్పలేనంత గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ కాలంలో వచ్చిన ఆణిముత్యాలు ఇప్పటి తరానికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుడిగంటలు ఓ మంచి ఉదాహరణ. ఆ విశేషాలు చూద్దాం. 1962లో శివాజీగణేశన్ హీరోగా కె శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘ఆలయమణి’ గొప్ప విజయం సాధించింది. వంద రోజులు ప్రదర్శింపబడి సూపర్ హిట్ అయ్యింది. దాన్నే తెలుగులో రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మాత సుందర్ లాల్ నేహతా రీమేక్ చేశారు. ముళ్ళపూడి వెంకటరమణ మాటలు సమకూర్చగా ఘంటసాల సంగీతం అందించారు. సి నాగేశ్వరరావు ఛాయాగ్రహణం, ఎస్ కృష్ణారావు ఆర్ట్ వర్క్ విభాగాలు నిర్వహించారు.

అపార్థాలు మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఏ స్థాయికి తీసుకెళ్తాయో అనే పాయింట్ చుట్టూ గుడిగంటలు తిరుగుతుంది. మంచివాడైన శ్రీమంతుడు శ్రీనివాసరావు(ఎన్టీఆర్). ఇతని లక్షణాలు నచ్చి స్నేహితుడైన వాడు హరి(జగ్గయ్య). ఇద్దరికీ ప్రేమకథలు ఉంటాయి. అయితే దగ్గరి వాళ్ళు చేసిన కొన్ని కుట్రల వల్ల వాసు ప్రమాదానికి గురై కాళ్ళు చచ్చుపడిపోయే దుస్థితిని తెచ్చుకుంటాడు. అంతేకాదు మిత్రుడైన హరిని చంపే ఆలోచన కూడా కలుగుతుంది. ఇది మరింత పతనానికి దారి తీస్తుంది. క్రమంగా నిజాలు తెలుసుకుని కళ్ళు తెరుచుకుని ఎవరు అయినవారు ఎవరు కానివారో గుర్తించి కథకు సుఖాంతం ఇస్తాడు.

ఎన్టీఆర్ అద్భుత నటనకు ప్రతీకగా గుడిగంటలుని చెప్పుకోవచ్చు. విలాస పురుషుడిగా మొదలుపెట్టి నడవలేని నిస్సహాయ స్థితికి రావడం దాకా అన్ని రకాల భావోద్వేగాలను గొప్పగా ఆవిష్కరించారు. మాతృకను మించిన స్థాయిలో మధుసూదనరావు గారి చిత్రీకరణ ప్రేక్షకులను మరో లోకంలో విహరించేలా చేసింది. ముఖ్యంగా ‘జన్మనెత్తితిరా అనుభవించితిరా’ పాట హోరెత్తిపోయింది. ఒక ట్రాజెడీ సాంగ్ ఆ స్థాయిలో జనాదరణ పొందటం చాలా అరుదు. 1964 జనవరి 14న సంక్రాంతికి విడుదలైన సినిమా ఇదొక్కటే. అదే నెల 9న వచ్చిన ఏఎన్ఆర్ ‘ఆత్మబలం’ పోటీని తట్టుకుని మరీ నిలబడింది. రాష్ట్రప్రభుత్వం ఈ చిత్రానికి కాంస్య నంది అందించి గౌరవించింది. కృష్ణకుమారి, శాంతకుమారి, గిరిజ, చిత్తూరు నాగయ్య, రేలంగి, రమణారెడ్డి, మిక్కిలినేని, వాసంతి ఇతర తారాగణం

Also Read : Deeparadhana : స్నేహానికి త్యాగానికి ప్రతీక ‘దీపారాధన’ – Nostalgia