మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి రానుందా..? నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతోందా..? అంటే సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. ‘‘కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు మళ్లీ ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇందుకు పరిష్కారం కోవిడ్ వ్యాక్సిన్ వేయడమే. ఆరు రోజుల్లో ముగిసే పరిషత్ ఎన్నికల ప్రక్రియ తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టి అంతా […]
గాలిలో దీపం మాదిరిగా సాగే వ్యవసాయంలో పంట చేతికి వచ్చినా.. ఇంటికి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ప్రకృతి విపత్తులు, కరువులు, అధిక వర్షాలు.. ఇలా ఏవైనా సరే వ్యవసాయానికి గొడ్డలిపెట్టు వంటివే. కాలం బాగా అయి, ప్రకృతి విపత్తలు లేకుండా ఉంటేనే పంట ఇంటికొచ్చేది. లేదంటే రైతులు పెట్టిన పట్టుబడి అంతా నష్టపోవడం తప్పా మరో గత్యంతరం లేదు. వర్షాలు, ప్రకృతి విపత్తలను ప్రజలు, ప్రభుత్వాలు.. ఎవరూ నియంత్రించలేరు. కానీ పంట నష్టపోతే ఆదుకునే అవకాశం మాత్రం […]
పేరుకే సంక్షేమ పథకాలు.. కానీ ప్రజలకు అందేది శూన్యం. అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కనికరించలేదు. మాకు పథకం రాకుండా మా ఊరి నాయకుడు అడ్డుకుంటున్నాడు… ఇదీ నిన్న మొన్నటి వరకూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో తరచూ వినిపించే మాట. ఈ మాటల్లో వంద శాతం వాస్తవం ఉంది. పథకం ప్రవేశపెట్టి.. బడ్జెట్ కేటాయించి.. అందులో ఎలా కోత వేద్దామనేలా గత ప్రభుత్వాలు ఆలోచించేవి. దరఖాస్తు చేసుకున్నా రకరకాల కారణాలు చెప్పి అధికారులు తిరస్కరించేవారు. […]
గ్రామ స్వరాజ్యానికి గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వచనంగా మారాయి. ప్రజలకు తమ ఊరిలోనే ప్రభుత్వ సేవలు అందించాలన్న మహాత్మా గాంధీ కలలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు ప్రజలకు ఉన్నతమైన, సత్వర సేవలను అందిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున లాంఛనంగా ప్రారంభమైన సచివాలయ వ్యవస్థ ఏడాది కాలంలోనే కోటి వినతులను పరిష్కరించి సరికొత్త రికార్డును సృష్టించాయి. గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభమైనది గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ అయినా.. […]
ఏడు దశాబ్ధాలపైబడిన భారతదేశ స్వాతంత్య్రంలో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్లో సాకారమైంది. సరిగ్గా ఏడాది కిందట ఆ మహాత్ముడి జయంతి రోజునే ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. రాజకీయ ఉద్ధండులు, దశాబ్ధాల పరిపాలన, రాజకీయ అనుభవం ఉన్న వారు చేయలేని పనిని వైఎస్ జగన్ అనే యువకుడు చేసి చూపించాడు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాలనను గ్రామాల చెంతకు చేర్చారు. ముందు చూపు […]
ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలి ఉన్న రంగుల తొలగింపు అంశం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ అంశంపై ఇటీవల దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారించిన ఏపీ హైకోర్టు పది రోజుల్లో ఆ రంగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రిం కోర్టును ఆశ్రయించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద రంగుల అంశంపై ఏపీ హైకోర్టు […]
గ్రామ సచివాలయం.. దేశ చరిత్రలోనే సరికొత్త విధానం. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్వం ఆచరణలో చూపెట్టిన జగన్ సర్కార్ ఇదే కోవలో మరో ముందడుగు వేయబోతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం.. మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న జగన్ సర్కార్ ఆ దిశగా ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వైద్యానికి సంబంధించి సీఎం జగన్ తన సరికొత్త ఆలోచనను వెలిబుచ్చారు. త్వరలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తామని ఇటీవల విజయనగరంలో […]
విజయనగరంలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించిన తీరు ఎంతో ఆలోచనాత్మకంగా, ఉన్నతంగా ఉంది. ఆయన ఆలోచనలను మనం ఊహించుకుంటే.. ‘అవును.. ఎంత బాగుందో కదా ఆయన కల’ అంటూ అనుకుంటాం. అంతలోనే ఒక్కొక్కటిగా వాస్తవ రూపం దాల్చుతూ మన ముందే కనపడుతున్న కార్యక్రమాలు ఆయనపై గౌరవాన్ని పెంచుతాయి.