రాజమహేంద్రవంలోని గోదావరి నది ఒడ్డున ఛాంబర్ ఆఫ్ కామర్స్ కల్యాణ మండపం. నూతనంగా ఎన్నికైన ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలక వర్గానికి సన్మానం కార్యక్రమం. వేదికపై మంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భారత్ రామ్, టిడిపి వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ, రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు ఆసీనులైయ్యారు. ఆహ్వానం లేదో, లేక ఉన్నా రాలేకపోయారో గాని […]