అమెరికా చరిత్రలోనే మొదటిసారి ఓ సిటి పోలీసు విభాగాన్ని రద్ద చేయాలనే సంచలన నిర్ణయం జరిగింది. నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మరణంపై అమెరికా మొత్తం జరుగుతున్న ఆందోళనలు అందరికీ తెలిసిందే. నిరవధికంగా జరుగుతున్న ఆందోళనల ఫలితంగా మిన్నియాపోలీసు పోలీసు విభాగాన్నే రద్దు చేసేయాలని మిన్నియాపోలీసు సిటి కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకున్నది. తొమ్మిది మంది సభ్యులున్న కౌన్సిల్లో మెజారిటి సభ్యుల నిర్ణయంతో పోలీసు విభాగం రద్దయిపోయింది. పోలీసు శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై జరిగిన సమావేశంలో కౌన్సిల్ లో […]
ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఉదంతం చోటుచేసుకుంది. అయితే ఇది అమెరికాలో కాదు. మెక్సికోలో చోటు చేసుకుంది. మాస్క్ ధరించలేదని ఒక కార్మికుడుని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అంత వరకు పర్వాలేదు. కాని ఆ కార్మికుడు పోలీసు కస్టడీలో మృతి చెందాడు. దీంతో మెక్సికోలో ఆందోళనలు పెరిగాయి. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వార్ మొదలైంది. దీంతో మెక్సికోలో అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మెక్సిలో ఆందోళనకారులు […]