రాయలసీమ నేతలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో.. ఇలా గ్రేటర్ రాయలసీమ అంటూ కొత్త నినాదం పిలుపునివ్వడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. అయితే ప్రజలందరూ ఆమోదించిన మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా పురుడోపోసుకుంటున్న కొత్త ఉద్యమం ఎలా ముందుకు సాగుతుందన్నదే ఇప్పుడు ప్రశ్న.. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తేవాలని రాయలసీమకు చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు […]