ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో రోజుకొక సంఘటనతో అనూహ్య మలుపులతో పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టు ఉత్తర్వుల తర్వాత తనకు తానుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా రమేశ్ కుమార్ ప్రకటించుకోవడం, ఆ వెంటనే ఉత్తర్వులను కూడా రెడీ చేయించుకోవడం తెలిసిందే. అయితే దీనిపై అడ్వొకేట్ జనరల్ స్వయంగా మీడియా ముందకొచ్చి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయను పునర్నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులపై కమిషన్ కార్యాలయ ఇన్చార్జి కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ […]