భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు తెగిపోయి, రోడ్లు కొట్టుకుపోయి ప్రయాణాలు కష్టంగా మారాయి. దీనికి తోడు వర్ష బీభత్సానికి ప్రమాదవశాత్తు మరణాలు సైతం సంభవిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో పడుతున్న వర్షాలకు ఒక స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. A school bus got stuck in a drain of water near Bikalkhedi village of Shajapur district, more than 24 school children were […]
వర్షాకాలంలో, లేదా భారీగా వరదలు వచ్చిన సమయంలో మనం సాధారణంగా వినే పదాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా వినిపించేవి టీఎంసీ, క్యూసెక్కు.. అనే పదాలు. మరి ఎప్పూడూ వినే పదాల అర్థం మీకు తెలుసా?? క్యూసెక్కు.. దీని అర్థం ఒక సెకనులో ప్రవహించే ఘనపు అడుగుల నీరు. సింపుల్ గా చెప్పాలంటే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. ఇలా వచ్చే నీరు 28 లీటర్లు ఉంటుంది. అలాగే ఒక ప్రాజెక్టులో నిల్వ ఉండే నీటి పరిమాణాన్ని […]
కురుస్తున్న వర్షాన్ని చూస్తున్న పెద్దవాళ్ళు ఇంతకంటే పెద్దవానలే పడేవిరా.. అనడం అక్కడక్కడ వింటున్నాం. ఇప్పుడంటే సెంటీమీటర్లు, మిల్లీ మీటర్లుతో కొలుస్తున్నారు. వాళ్ళదృష్టిలో పెద్దవానలు అంటే రోజులు, నెలల తరబడి ముసురు పట్టి ఉండేదనే అర్ధం. దీపావళి ముందు రోజుల్లో వారం, పది, పదిహేను రోజుల పాటు ప్రతి రోజూ వర్షం పడుతూనే ఉండేదని అప్పటి విషయాలను వారిని కదిలిస్తే చెబుతుంటారు. అయితే ఆ కాలంలో కాలనీలకు కాలనీలు, ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోయేవి కాదా? అన్న సందేహం రాకమానదు. […]
వెనకటికొక ఆసామి ఇల్లు తగలబడి పోతుంటే చెరువు తవ్వడం మొదలు పెట్టాడట. ప్రస్తుతం వర్షాలు ముంచెత్తి, పంటలు, జనావాసాలు ఎక్కడికక్కడే ముంపులో చిక్కుకుపోతే గానీ మన కళ్ళుతెరుచుకోవడం లేదు. ముందుచూపు అన్న మాటకు ఏ కోశాన ఆస్కారం లేకుండా వ్యవహరిస్తున్న కారణంగానే ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్న విషయాన్ని ఎవ్వరూ ఒప్పుకునేందుకు కూడా ఇష్టపడడం లేదంటే మనం ప్రకృతికి ఎంత వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నామో అర్ధం చేసుకోవచ్చు. గత ముప్పైళ్ళుగా ప్రతి పదేళ్ళకోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనావాసాలు, […]
ప్లాస్టిక్.. ఈ మాట, సదరు వస్తువులు వినియోగించుకునే వారికి సౌలభ్యంగానే ఉంటుంది కానీ పర్యావరణ నిపుణులను మాత్రం ఉలిక్కిపడేలా చేస్తుంది. ప్లాస్టిక్ వస్తువును వినియోగించడం కారణంగా ఏర్పడే నష్టం ఇప్పటికిప్పుడు తెలియకపోవడమే దాని విసృత వినియోగాన్ని పెంచుతోందన్న అభిప్రాయం కూడా ఉంది. దీనిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ వినియోగంలో వచ్చిన మార్పు అతి తక్కువనే చెప్పాలి. ఉదయం లేచింది మొదలు పళ్ళుతోముకు బ్రష్‌ల దగ్గర ప్రారంభిస్తే అతి భద్రంగా దాచుకునే ఏటీయం కార్డు వరకు ప్లాస్టిక్‌తోనే తయారవుతున్నాయి. […]