iDreamPost

మోరంచపల్లి గ్రామానికి బయలు దేరిన ఆర్మీ హెలికాప్టర్లు!

మోరంచపల్లి గ్రామానికి బయలు దేరిన ఆర్మీ హెలికాప్టర్లు!

గత కొన్ని రోజుల నుంచి  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాత్రి కురిసిన వానకులు భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చటంతో మోరంచపల్లి నీటిలో మునిగిపోయింది. దాదాపు 15 అడుగుల మేర వరద నీరు నిండుకుపోయింది. దీంతో ఇళ్లు, వాకిళ్లు నీటిలో మునిగిపోయాయి. ఇంట్లోని వస్తువులు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. తమను కాపాడేందుకు ప్రభుత్వం రావాలని అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. తాజాగా సీఎం ఆదేశాలతో ఆ గ్రామానికి ఆర్మీ హెలికాప్టర్లు బయలు దేరుతున్నాయి.

మోరంచపల్లి మొత్తం 1500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ 1500 మందిలో ఎంత మంది క్షేమంగా ఉన్నారన్నది తెలియరావటం లేదు.  ఈ గ్రామ పరిస్థితిని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇక, సీఎం కేసీఆర్ సైతం గ్రామంలో పరిస్థితి గురించి ఆరా తీశారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్మీకి చెందిన రెండు హెలీకాఫ్టర్లను భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామానికి పంపిస్తున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి