iDreamPost

భారీ వర్షాలతో నీట మునిగిన విమానాలు.. ఎక్కడంటే?

భారీ వర్షాలతో వింతైన దృష్యం చోటుచేసుకుంది. అక్కడి విమానాశ్రయాన్ని వరద నీరు ముంచెత్తగా, విమానాలు నీట మునిగాయి. ఇక మొసళ్లు వరద నీటిలో రోడ్డుపై ఈదుతూ కనిపిస్తున్నాయి.

భారీ వర్షాలతో వింతైన దృష్యం చోటుచేసుకుంది. అక్కడి విమానాశ్రయాన్ని వరద నీరు ముంచెత్తగా, విమానాలు నీట మునిగాయి. ఇక మొసళ్లు వరద నీటిలో రోడ్డుపై ఈదుతూ కనిపిస్తున్నాయి.

భారీ వర్షాలతో నీట మునిగిన విమానాలు.. ఎక్కడంటే?

ఇటీవల మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడులోని చెన్నై ని వరదలు ముంచెత్తిన సంగతి తెల్సిందే. అక్కడి పరిస్థితులు ఇంకా పూర్తిగా చక్కబడక ముందే.. మరో దేశంలో అకాల వరదలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. పలు ప్రాంతాలలో వర్షాల కారణంగా భీకర దృశ్యాలు కనిపించాయి. దీనితో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు.

క్వీన్ ల్యాండ్ లో మొదట సాధారణ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత వరదలు సంభవించడంతో ఆయా ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్ల పైకి, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలంతా ఇళ్ళని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయం కూడా మునిగిపోయింది. అక్కడి దృశ్యాలను గమనిస్తే విమానాలు నీటిలో తేలుతూ కనిపిస్తున్నాయి. ఇక మొసళ్ళు కూడా నగరంలో నీటితో నిండిపోయిన రోడ్లపై ఈదుతూ కనిపిస్తున్నాయి. అక్కడి పరిస్థితులు రోజు రోజుకి విషమించడంతో.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు తమ ఇళ్లను వదిలి పడవలపైనే వారి ప్రయాణాన్ని సాగించాల్సి వస్తుంది.

ఆస్ట్రేలియన్ వాతావరణ శాఖ ప్రకారం.. ఏడాది పొడవునా ఏకధాటిగా వర్షాలు కురిశాయని.. వరదలు కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. అయితే, వర్షాలు ఇంకా ఆగలేదు. రానున్న 24 గంటల్లో ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధిక ఆటుపోట్లతో పాటు సోమవారం అంతటా కుండపోత వర్షం కొనసాగుతుందని, లోతట్టు ప్రాంతాలపై ప్రభావం పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే కొన్ని వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, పరిస్థితులు క్షణ క్షణానికి అత్యంత క్లిష్టంగా మారుతున్నాయని వారు పేర్కొన్నారు. ఇంకా, వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని. చాలా ఇళ్లు, రోడ్లు నీట మునగడంతో.. నిత్యావసర సేవలు దెబ్బతిన్నాయని. వారికి తగిన సౌకర్యాలను అందించడానికి ప్రయత్నిస్తున్నామని వారు తెలియజేశారు.

ఈ వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి కైర్న్స్ నగరంలో 2 మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయితే, మంగళవారం నాటికీ వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ నదులు ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదు. అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే రానున్న రోజుల్లో గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ నదుల్లో నీటిమట్టం పెరిగితే .. వారి అంచనాల ప్రకారం 1977 తరువాత రికార్డు స్థాయిలో నీటిమట్టం పెరగడం.. ఇదే తొలిసారి అవుతుందని పేర్కొన్నారు. ఏదేమైనా, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కనీస సదుపాయాలు లేక అల్లాడిపోతున్నారు. మరి, ఆస్ట్రేలియాలో సంభవించిన ఈ వరదలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి