iDreamPost

జల ప్రళయం.. తుఫాన్ ధాటికి 2 వేల మంది మృతి..

జల ప్రళయం.. తుఫాన్ ధాటికి 2 వేల మంది మృతి..

ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రకృతి విలయాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న మొరాకో భూకంపంతో వణికిపోయిన సంగతి విదితమే. భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవంతులు కూలిపోయాయి. ఈ ఘోర కలికి సుమారు 2,800 మంది మృతి చెందారు. చాలా మంది ఆచూకీ కానరావడం లేదని తెలుస్తోంది. ఇంకా శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బతికున్నారో లేదో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పుడు లిబియాపై ప్రకృతి ప్రకోపాన్ని ప్రదర్శిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో ఆ దేశం అతలాకుతలం అవుతుంది. డేనియల్ తుఫాన్ ఆ దేశంపై పగబట్టింది. ముఖ్యంగా ఈ వరదలకు డేర్నా నగరం పరిస్థితి దారుణంగా ఉంది.

వరద నీరు భారీగా డ్యాముల వద్దకు చేరుకున్నాయి. పలు డ్యాములు పగిలిపోవడంతో డేర్నా నగరం పూర్తిగా మునిగిపోయింది. ఈ దాడిలో సుమారు 2 వేల మంది మరణించారు. సుమారు 5 నుండి 6 వేల మంది గల్లంతు అయ్యారని సమాచారం. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెట్టు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నిశ్శబ్దంగా ఉన్న నగరంలో రాత్రికి రాత్రే తుఫాన్ విలయం సృష్టించింది. వరద నీటిలో శవాలు కుప్పలు తెప్పలుగా తేలియాడుతున్న భీతావాహ దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తున్నాయి. జల ప్రళయం ధాటికి నగరం మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయింది. వాహనాలు బురద నీటిలో చిక్కుకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి