iDreamPost

అబద్ధంతో దూరమైన పేగు బంధం.. 35 ఏళ్ల తర్వత వరదల వల్ల కలిసింది

  • Published Jul 28, 2023 | 12:12 PMUpdated Jul 28, 2023 | 12:12 PM
  • Published Jul 28, 2023 | 12:12 PMUpdated Jul 28, 2023 | 12:12 PM
అబద్ధంతో దూరమైన పేగు బంధం.. 35 ఏళ్ల తర్వత వరదల వల్ల కలిసింది

కొన్ని సంఘటనలు చూస్తే.. విధి ఎంత విచిత్రమైందో కదా అనిపించక మానదు. కొందరి విషయంలో సినిమా కథలకు ఏమాత్రం తీసిపోని ట్విస్ట్‌లతో.. జీవితం రకరకాల మలుపులు తిరుగుతుంది. ఇప్పడు మనం చెప్పుకోబోయే కథ కూడా సినిమాకు ఏమాత్రం తీసిపోదు. రెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులు గురించి అడిగితే.. తాత ఓ మాట చెప్పాడు. మీ అమ్మనాన్న కారు యాక్సిడెంట్‌లో చనిపోయారు అని తెలిపాడు. తనకు తల్లిదండ్రులను దూరం చేసిన దేవుడి మీద ఆ చిన్నారికి చాలా కోపం వచ్చింది. నిజంగా ఆ దేవుడికి తన మీద ఏమాత్రం జాలి ఉన్నా.. ఒక్కసారి అయినా తన కన్నవాళ్లను చూపించేవాడు అని బలంగా నమ్మాడు. అయితే అతడి 35వ ఏట.. తన తల్లిని కలుసుకున్నాడు. సినిమాను మించి ట్విస్ట్‌లు చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు..

పంజాబ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం దేశ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి పేరు జగ్జిత్‌ సింగ్‌(37). ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతూ.. వాలంటీర్‌గా పని చేస్తుంటాడు. నానమ్మ, తాతయ్యల వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. చిన్నప్పుడు ఓసారి తల్లిదండ్రుల గురించి అడిగితే.. వారు జగ్జిత్‌కు ఆర్నెళ్ల వయసులో ఉండగానే కారు యాక్సిడెంట్‌లో చనిపోయారని తెలిపాడు. అమ్మనాన్న చనిపోయారని చాలా సార్లు బాధపడ్డాడు.

ఒక్కసారి వారిని చూసే అవకాశం వస్తే బాగుంటుదని ఎన్నో సార్లు కోరుకున్నాడు. తల్లితండ్రులు చనిపోవడంతో బాల్యం నుంచి అతడి ఆలనా పాలనా వాళ్లే చూసుకున్నారు. జగ్జిత్ పెరిగి పెద్దయ్యి ఖదియాన్‌లో గురుద్వారాలో ఆధ్యాత్మిక గాయకుడిగా మారాడు. అంతేకాక ఓ ఎన్జీవోను కూడా నడుపుతున్నాడు. ప్రకృతి వైపరిత్యాల సమయంలో సహాయక చర్యలో​ పాల్గొనేవాడు.

మలుపు తిప్పిన వరదలు…

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. పంజాబ్‌ పాటియాలాలో కూడా భారీ వరదలు వచ్చాయి. జగ్జిత్‌ తన ఎన్జీవోతో కలిసి ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించాడు. ఈ క్రమలో జగ్జిత్‌కు అత్త వరసయ్యే ఆమె ఒకరు ఫొన్‌ చేసింది. మాటల సందర్భంలో జగ్జిత్‌ తాను సహాయక చర్యలు అందిస్తోన్న ప్రాంతం పేరు చెప్పాడు. అప్పుడు ఆమె.. జగ్జిత్‌ వాళ్ల అమ్మమ్మ వాళ్లది కూడా అదే ఊరని చెప్పింది. తల్లిని చూడలేదు.. కనీసం తన అమ్మమ్మ వాళ్లు అయినా ఎవరైనా ఉంటే కలుస్తే బాగుటుందని భావించాడు. తన అత్త చెప్పిన అడ్రెస్‌ వెతుక్కుంటూ తన అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడు.

ఆ ఇంట్లో ఉన్నది తన అమ్మమ్మో కాదో తెలుసుకోవడం కోసం అనేక ప్రశ్నలు వేశాడు. ఆ వృద్ధురాలు ముందు జగ్జిత్‌ను చూసి భయపడింది. కానీ తర్వాత అసలు విషయం తెలసుకుని.. అప్పుడు వాస్తవం వెల్లడించింది. తన కుమార్తె హర్జిత్‌కు మొదటి పెళ్లి ద్వారా ఓ కొడుకు పుట్టాడు అని చెప్పింది. ఆ మాట విని జగ్జిత్‌.. అది నేనే అమ్మమ్మ అన్నాడు. ఇక మాటల మధ్యలో అతడికి ఓ నిజం తెలిసింది. తన కన్నతల్లి.. బతికి ఉందని తెలుసుకున్నాడు. వృద్ధాప్యం కారణంగా సరిగా నడలేకపోతున్న తన తల్లి దగ్గరకు చేరుకుని.. ఆమెను గుండెలకు హత్తుకుని.. తనివి తీరా ఏడ్చాడు.

అసలేం జరిగింది అంటే..

తన కన్నతల్లి బతికే ఉన్నా.. తాతయ్య మాత్రం ఎందుకు ఆమె మృతి చెందింది అని చెప్పాడో అర్థం కాలేదు జగ్జిత్‌కు. అతడి అనుమానం గ్రహించిన హర్జిత్‌.. జగ్జిత్‌కు ఆర్నెళ్ల వయసులో ఉండగా కారు ప్రమాదం జరిగిన మాట వాస్తవమే అని.. అయితే ఆ ప్రమాదలో జగ్జిత్‌ తండ్రి మాత్రమే మృతి చెందాడు. ఆ తర్వాత హర్జీత్‌ మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. జగ్జిత్‌ తాత, నాయనమ్మ అతడిని తెచ్చుకుని పెంచుకున్నారు. కన్నతల్లి బతికే ఉందని తెలిస్తే.. సమస్యలు తప్పవని.. భావించి.. ఆమె చనిపోయింది అని చెప్పాడు. తాత చెప్పిన ఒక అబద్ధం ఆ తల్లి కొడుకులను 35 ఏళ్ల పాటు దూరం చేస్తే.. వరదలు మాత్రం.. వారిద్దరిని కలిపాయి.

వాస్తవానికి జగ్జిత్‌కు తన తల్లి బతికే ఉందని ఐదేళ్ల క్రితం తెలిసింది. కానీ అప్పటికే అతడి తాతయ్య నానమ్మతోపాటు.. పెద్దమ్మ, పెదనాన్న కూడా చనిపోవడంతో.. తన తల్లి ఎవరు.. ఎక్కడ ఉంటుంది వంటి వివరాలు లభ్యం కాలేదు. దాంతో ఆమెను వెతికే ప్రయత్నాలు మానుకున్నాడు. కానీ పేగు బంధం చాలా గొప్పది కదా.. అందుకే సుమారు 32 ఏళ్ల తర్వాత.. దూరమయినా తల్లి, కొడుకులు కలుసుకున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జగ్జిత్‌కు పెళ్లై, 14 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కొడుకు సంతానం ఉన్నారు. తన భార్యా పిల్లలతో కలిసి వెళ్లిన అతడు తొలిసారి తన కన్నతల్లిని కలుసుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత కన్నతల్లిని కలుకున్న అతడి సంతోషాన్ని వర్ణించడానికి మాటలు లేవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి