iDreamPost

విషాదంలో ఉన్న లిబియాకు.. పొంచి ఉన్న మరో ముప్పు!

విషాదంలో ఉన్న లిబియాకు.. పొంచి ఉన్న మరో ముప్పు!

ప్రస్తుతం లిబియా దారుణమైన స్థితిలో ఉంది. అక్కడ మరణమృదంగం కొనసాగుతోంది. డేనియల్ అనే తుఫాన్ సృష్టించిన జల ప్రయళయంతో లిబియా వణికిపోయింది. ఇక అక్కడి ప్రధాన నగరమైన డెర్నా భితిల్లింది. తుఫాన్ వచ్చి రోజులు గడిచినా ఇప్పటికీ అక్కడ భయనాక పరిస్థితులు కొనసాగుతోన్నాయి. నివాస ప్రాంతాలు, వీధుల్లో ఎక్కడ చూసిన  బురద మేటలు ఉన్నాయి. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 11వేలకు పైగా దాటింది. అంతేకాక 10వేల మంది జాడలేకుండా పోయారు. వారి కోసం అక్కడి అధికారులు అన్వేషిస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న లిబియాకు మరో పెను ముప్పు పొంచి ఉంది. అక్కడ ఉన్న నిల్వ ఉన్న బాంబులు పేలితే పెను విధ్వంసం జరుగుతుందని స్థానిక మీడియా వెల్లడించింది.

లిబియాలోని డెర్నా లో వచ్చిన డేనియల్ తుఫాన్ ధాటికి ప్రజలు విలవిల్లాడిపోయారు. నివాస ప్రాంతాలు, వీధుల్లో ఎటుచూసినా బురద మేటలు ఉన్నాయి. వాటి కింద శవాలు గుట్టలుగా బయటపడుతున్నాయి. మరోవైపు సముద్ర జలాల నుంచి వందల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. భారీ వర్షాలకు రెండు డ్యామ్‌లు తెగిపోవడంతో భారీ వరదలు వచ్చాయి. లిబియా తీరప్రాంత నగరమైన డెర్నాలో మరణించిన వారి సంఖ్య 11,300కి చేరుకుందని లిబియా రెడ్ క్రెసెంట్ తెలిపింది.

వరదల్లో ముగినిపోయిన డెర్నాలో అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. అంతేకా  దాదాపు 10 వేల మంది ఆచుకు లభించడం లేదు. తప్పిపోయిన వారంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇలా డేనియల్ తుఫాన్ సృష్టించిన విషాదంలో అక్కడి ప్రజలు అల్లాడిపోతుంటే.. మరో భయంకర విషయం బయటకు వచ్చింది. లిబియా ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి మందులు నిల్వ ఉన్నాయి. అక్కడ పెద్ద సంఖ్యలో మందు సామాగ్రి నిల్వ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మందు సామాగ్రి రవాణకు లిబియా ప్రధాన కేంద్రంగా ఉండేదని కొందరు తెలిపారు.

ఈ క్రమంలోనే అక్కడ పెద్ద సంఖ్యలో మందు సామాగ్రి, మందు పాతరలు ఉన్నాయి. ఇక తాజాగా డేనియల్ తుఫాన్ ధాటికి డెర్నా అస్తవ్యస్థమైంది. ఇలాంటి సమయంలో పొరపాటున ఆ బాంబులు పేలితే.. జరిగే విధ్వంసం ఊహిచలేదని అక్కడి మీడియ వెల్లడించింది. ఇలా ఒక ముప్పుతోనే కకావికలం అవుతున్న లిబియాకు ఈ బాంబుల  రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. మరి.. ఆ బాంబులు పేలితే పెను విధ్వసం జరుగుతుంది. మరి.. ప్రస్తుతం లిబియాలో ఏర్పడిన పరిస్థితులకు కారణం ఏంటనేది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి