iDreamPost

ఢిల్లీ: సవాలుగా మారిన సహాయ చర్యలు.. ఇళ్ల నుంచి రాని ప్రజలు!

ఢిల్లీ: సవాలుగా మారిన సహాయ చర్యలు.. ఇళ్ల నుంచి రాని ప్రజలు!

ఢిల్లీ ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు. ఢిల్లీ రహదారులు నదులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా యమునా నది వరద నీరే కనిపిస్తోంది. గురువారం తెల్లవారుజాముకే.. యమునా నదీ ప్రవాహం 208.51 మీటర్లు దాటేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా వరద నీరు ముంచెత్తింది. ఎప్పుడూ లేని విధంగా యమునా నది మహోగ్రరూపం దాల్చింది. 1978లో 207.49 మీటర్లు ప్రవహించిన యమునా నది.. ఇప్పుడు 208 మీటర్లు దాటేసింది.

ఢిల్లీ వరదల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కార్యాలయాలకు సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సూచించారు. గురువారం 3 గంటల సమయానికి యమునా నది ప్రవాహం గరిష్టానికి చేరుతుందని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా నదీ ప్రవాహం తగ్గుతుందన్నారు. నగరవాసులు అంతా ఎంతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే వరద నీరు చేరడంతో మూడు నీటి శుద్ధి కేంద్రాలు మునిగిపోయాయి. వరదనీరు పోయిన తర్వాత మెషిన్లను బాగుచేసి నీటి శుద్ధిని ప్రారంభించారు. ఢిల్లీలో 25 శాతం వాటర్ సప్లై ఆపేశారు. ఆ ప్రాంతాల్లో రేపటికి నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు 10 అడుగుల ఎత్తుకు చేరింది. భవనాల్లో సెల్లార్ మునిగిపోయి ఫస్ట్ ఫ్రోర్ వరకు దాకా నీరు చేరింది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ప్రజలు సహకరించడం లేదు. మరీ ప్రమాదకర పరిస్థితి ఉన్న ప్రాంతం నుంచి కూడా ప్రజలు రావడానికి ఇష్టపడటం లేదు. సురక్షిత ప్రాంతాలను తరలిస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదు. సిబ్బంది బోట్లు వేసుకుని కాలనీల్లో తిరుగుతూ మైకుల్లో అనైన్స్ చేస్తున్నారు. అయినా ప్రజలు మాత్రం తమ ఇల్లు వదిలి రామంటూ చెబుతున్నారు. చేసేది ఏమీ లేక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు వేసుకుని రిస్క్ తీసుకోకండి వచ్చేయండి అంటూ ప్రజలను బతిమాలుకుంటున్నారు.

ఒక్క ఢిల్లీలోనే కాదు.. ఉత్తరాదిన ఈ వరదలు, వర్షాలు అతలాకుతలం చేస్తున్నారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి ఘోరంగా మారింది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. ఈ వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ప్రదేశ్ లో 12 మంది, పంజాబ్- హరియాణాలో 21 మంది చనిపోయారు. పలు చోట్ల జాతీయ రహదారులు కూడా దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వాలు ప్రజలను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతాయని ధైర్యం చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి