iDreamPost

వరంగల్ భద్రకాళి చెరువుకు గండి.. ఆందోళనలో స్థానికులు

  • Author Soma Sekhar Published - 03:33 PM, Sat - 29 July 23
  • Author Soma Sekhar Published - 03:33 PM, Sat - 29 July 23
వరంగల్ భద్రకాళి చెరువుకు గండి.. ఆందోళనలో స్థానికులు

గతకొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక భారీ వర్షాలకు రాష్ట్రంలో చెరువులన్నీ నిండుకుండలా నిండిపోయాయి. వరదనీరు ఎక్కువ కావడంతో.. కొన్ని చెరువులకు గండ్లు సైతం పడ్డాయి. తాజాగా భారీ వర్షానికి వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. దాంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. గండి పడిన విషయం తెలుసుకున్న పోలీసులు కాలనీ వాసులను అప్రమత్తం చేశారు.

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతి ఎక్కువ కావడంతో.. వరంగల్ లోని భద్రకాళి చెరువుకు భారీ గండి పడింది. పోతన్ నగర్ వైపు ఉన్న చెరువు కట్ట బలహీనంగా ఉండటంతో.. దాదాపు 10 నుంచి 15 మీటర్ల మేర కట్ట తెగిపోయింది. దీంతో వరద నీరంతా.. సమీపంలో ఉన్న పోతన్ నగర్, రాజీవ్ కాలనీ, సరస్వతి కాలనీలకు చేరింది. ఇక గండిపడిన విషయం తెలుసుకున్న పోలీసులు.. కాలనీ వాసులను అప్రమత్తం చేశారు. నీటి ప్రవాహం పెరిగే సూచనలు ఉన్నందున ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు.

అయితే చెరువు కట్టకు ప్రమాదం లేదని, ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రజలను అప్రమత్తం చేసినట్లుగా వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. కాగా.. చెరువుకు గండి పడటంతో దగ్గరలోని కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. చెరువును పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. దాంతో గండిని పూడ్చేందుకు వరంగల్ మహానగరపాలక సంస్థ యంత్రాంగం నివారణా చర్యలు చేపట్టింది.


ఇదికూడా చదవండి: మహిళలకు శుభవార్త.. ఆ రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి