గోదావరి నదికి వరద నెమ్మదిగానే పెరుగుతోంది. కానీ ఉభయ గోదావరి జిల్లాలోని పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళనలను పెంచుతోంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భద్రాచలం, ధవళేశ్వరంలలో రెండు అడుగల మేర గోదావరినది నీటిమట్టం పెరిగింది. నెమ్మదిస్తుందన్న అంచనాలు వేసినప్పటికీ తాలిపేరు నుంచి వచ్చిపడ్డ ముంపు నీరు ఒక వైపు, శబరి, ఇంద్రావది నదులకు వచ్చిన వరద మరోవైపు గోదావరి నీటిమట్టం పెంపునకు దోహదపడుతున్నాయని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి మరింతగా ముంపునీరు వస్తుందన్న […]