గోదావరి నదికి వరద నెమ్మదిగానే పెరుగుతోంది. కానీ ఉభయ గోదావరి జిల్లాలోని పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళనలను పెంచుతోంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భద్రాచలం, ధవళేశ్వరంలలో రెండు అడుగల మేర గోదావరినది నీటిమట్టం పెరిగింది. నెమ్మదిస్తుందన్న అంచనాలు వేసినప్పటికీ తాలిపేరు నుంచి వచ్చిపడ్డ ముంపు నీరు ఒక వైపు, శబరి, ఇంద్రావది నదులకు వచ్చిన వరద మరోవైపు గోదావరి నీటిమట్టం పెంపునకు దోహదపడుతున్నాయని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి మరింతగా ముంపునీరు వస్తుందన్న […]
గోదావరి ఉగ్రరూపం ఒకవైపు, 19వ తేదీన అమావాస్య రావడం మరోవైపు ఉభయగోదావరి జిల్లాల వాసులకు ఆందోళన పెంచుతోంది. అమావాస్య, పౌర్ణమిల సమయంలో సముద్రానికి వచ్చే ఆటు, పోట్లు గోదావరి నది వరదను ప్రభావితం చేస్తాయి. సాధారణ రోజుల్లో ఎన్ని లక్షల క్యూసెక్కుల నీటినైనా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అయితే అమావాస్య, పౌర్ణమిల సమయంలో అయితే నీటిని లాక్కోవడం ఆపేస్తుంది. దీంతో ఒక్కోసారి నది వెనక్కు తన్నిపడుతుంది. అప్పుడు మాత్రం ఏటి గట్లు తెగిపడే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని కోస్తావాసులు […]