చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శపథం చేశారు. ఇలాంటి శపథమే మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కొడాలి నాని కూడా చేశారు. చంద్రబాబు జన్మలో ముఖ్యమంత్రి కాలేరని, ఒక వేళ మళ్లీ ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాని శపథం చేశారు. నాని చేసిన వ్యాఖ్యలే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా […]
తనపై నమోదైన కేసుల నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ ఆమరణనిరాహార దీక్షకు పూనుకున్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షకు చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయించుకోగా.. ఇటీవల తాడిపత్రిలో జరిగిన ఉద్రిక్త ఘటన నేపథ్యంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్ […]
తాడిపత్రిలో రాజకీయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. లేనిపోని వివాదాలు రేపి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారనే వ్యాఖ్యలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆయన వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని హత్యా ఆరోపణలు చేశారని తెలుస్తోంది. తనను చంపించే ందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం చర్చనీయాంశమైంది. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ఫ్యాక్షన్ […]
అవినీతి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రత్యక్ష వివాదాలకు కారణం అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ ప్రభుత్వంపై, ప్రజా ప్రతినిధులపై ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఓ ప్రణాళిక ప్రకారం విషయం చిమ్ముతున్నట్లు వరుసగా జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, తమ ప్రత్యర్థి పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలపై నేరుగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇందు కోసం సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు. […]