ఎవరిమీదో ఒకరి మీద బురద జల్లితే ఆ బురద అవతలి వ్యక్తి కడుక్కునే సమయానికి ఏదో ఒకటి జరగకపోదా అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయానికి, ఫైర్ బ్రాండ్గా పేరు ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ధీటు గా సమాధానం చెబుతుండడంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఒకపక్క తమ సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్న వేళ వ్యక్తిగత ఆరోపణలు చేసి, ఎలాగోలా పబ్బం గడుపుకునేందుకు నెల్లూరు జిల్లా టీడీపీ నేత […]