మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక సమాజంలో ఉన్నామా? అని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దానికి సమాధానం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీయేనన్న సంగతి మరచిపోతున్నారు? పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ సారా తాగి చనిపోయారంటూ ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు తాము ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామా? అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం తాగిన […]
చేసుకున్నవాడికి చేసుకున్నంత.. చిక్కులు కొని తెచ్చుకోవడం.. ఈ మాటలు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు అతికినట్లు సరిపోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలలో లోపాలు ఉంటే విమర్శలు చేయడం, పాలకులు అక్రమాలు, అవినీతికి పాల్పడితే ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల బాధ్యత. కానీ పనిగట్టుకుని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధినేతను అప్రదిష్టపాలుచేయాలని ప్రయత్నిస్తే.. చిక్కులు తప్పవు. ఇప్పుడు దేవినేని ఉమా కూడా ఇలాంటి చిక్కులనే కొని తెచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ అన్నారంటూ.. ఓ వీడియోను ఈ నెల7వ తేదీన […]
అధికారంలో ఉన్నప్పుడు హద్దులు దాటి, ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు సుద్దులు చెప్పడం కొంత మంది రాజకీయ నేతలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఈ తరహా నేత ఒకరు కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను ఏకవచనంతో సంభోదిస్తూ, వ్యక్తిగత విమర్శలు చేస్తూ, అసభ్య పదజాలాన్ని ఉపయోగించే సదరు నేతకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవడంతో తత్వం బోధపడుతోంది. అయన మరెవరో కాదు.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. మంత్రి కొడాలి నాని సంస్కారహీనంగా మాట్లాడుతున్నారంటూ దేవినేని ఉమా […]
ఏదైనా ఒక అంశంపై రాజకీయం చేయాలనుకుంటే.. దాని గురించి తన అనుకూల మీడియాలో ఓ కథనం రాయించడం, ఆ తర్వాత దాన్ని పట్టుకుని ప్రెస్మీట్లు పెట్టి నానా హంగామా చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు బాగా అలవాటైన పని అన్న విషయం ఈ పాటికే అందరికీ అర్థం అయింది. కియా మోటార్స్ తరలిపోతోందంటూ గతంలో హడావుడి చేసినట్లుగానే… ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ రాజకీయం చేయాలని ప్రయత్నిస్తోంది. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు […]