ఏలూరు జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ పరిశ్రమలో ఔషధాల తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నారు. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్ లో మంటలు చెలరేగి రియాక్టర్ పేలింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో యూనిట్లో 150 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. భారీ పేలుడుతో మంటలు చెలరేగడంతో అక్కడిక్కడే ఐదుగురు సజీవదహనమయ్యారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా […]