పరిశ్రమల ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పలువురు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అనంతపురంలో ఎలక్ట్రిక్ బస్సుల యూనిట్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం అవుతుండగా, తాజాగా కృష్ణపట్నంలో మరో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 1 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహన సంస్థ డావో ఈవీటెక్ సొంతంగా ప్లాంట్ నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తోంది. కొత్త ప్లాంట్ ని కృష్ణపట్నం తీరంలో నిర్మించబోతున్నట్టు సంస్థ సీఈవో […]