పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ కోసమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకువచ్చిన ప్రైవేటు ఈ యాప్‌కు హైకోర్టులో మరోసారి బ్రేక్ పడింది. అనుమతులు లేనందున ఈ యాప్‌ను ఉపయోగంలోకి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహణ తన సొంత వ్యవహారమన్నట్లు ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ వాచ్ యాప్‌ను ఈ నెల 3వ తేదీన ఆవిష్కరించారు. […]