ఇరాక్ లోని 3,400 సంవత్సరాల పురాతన నగరం తీవ్రమైన కరువు తరువాత నీటి అడుగున నుండి బయటపడింది. తీవ్రమైన కరువు కారణంగా ఒక జలాశయం నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో ఇలా 3,400 సంవత్సరాల పురాతన నగరం దర్శనమిచ్చింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉత్తర ఇరాక్ లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని టైగ్రిస్ నది వెంబడి మోసుల్ జలాశయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీన్ని పరిశోధించేందుకు కుర్దిష్ మరియు జర్మన్ పురావస్తు శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు నడుం బిగించారు. ఈ ప్రాంతాన్ని క్రీ.పూ 1550 నుండి 1350 వరకు పాలించిన మిట్టాని సామ్రాజ్యం లోని ప్రధాన కేంద్రమైన […]