iDreamPost
android-app
ios-app

3,400 ఏళ్ళ చరిత్ర – కరువు వచ్చింది.. నగరం బయటపడింది

3,400 ఏళ్ళ చరిత్ర – కరువు వచ్చింది.. నగరం బయటపడింది

ఇరాక్ లోని 3,400 సంవత్సరాల పురాతన నగరం తీవ్రమైన కరువు తరువాత నీటి అడుగున నుండి బయటపడింది. తీవ్రమైన కరువు కారణంగా ఒక జలాశయం నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో ఇలా 3,400 సంవత్సరాల పురాతన నగరం దర్శనమిచ్చింది.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉత్తర ఇరాక్ లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని టైగ్రిస్ నది వెంబడి మోసుల్ జలాశయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీన్ని పరిశోధించేందుకు కుర్దిష్ మరియు జర్మన్ పురావస్తు శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు నడుం బిగించారు.

ఈ ప్రాంతాన్ని క్రీ.పూ 1550 నుండి 1350 వరకు పాలించిన మిట్టాని సామ్రాజ్యం లోని ప్రధాన కేంద్రమైన జఖికు గా భావిస్తున్నారు. ఈ రాజ్యంలోని భూభాగం మధ్యధరా సముద్రం నుండి ఉత్తర ఇరాక్ వరకు విస్తరించింది.

1980 లలో ఇరాక్ ప్రభుత్వం మోసుల్ ఆనకట్టను నిర్మించిన తరువాత జఖికు నీటి అడుగున మునిగిపోయింది. అయతే ఇప్పుడా నగరం తిరిగి నీటిమట్టం కిందకు వెళ్ళిపోయినప్పటికీ శాస్త్రవేత్తలు ఈ ప్రదేశాన్ని కేటలాగ్ చేశారు. ఈ ప్రదేశంలో దొరికిన అనేక కళారూపాలు ఇతరత్రా అవశేషాలను డుహోక్ నేషనల్ మ్యూజియంలో ఉంచారు.